– ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే
మౌనంగా ఉండలేం: సీఎం స్టాలిన్
చెన్నై: బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి’ పాల్పడ్డాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఆరోపణలకు తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మద్దతు తెలిపారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ ‘పోలింగ్ రిగ్గింగ్ యంత్రం’గా మార్చిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ పోరాటంలో కాంగ్రెస్‌తో డీఎంకే కలిసి నిలబడుతుందన్నారు. బీజేపీ.. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అపహాస్యం చేస్తుంటే మౌనంగా ఉండలేం అని వ్యాఖ్యానించారు. ప్రతి రాష్ట్రానికీ పూర్తి మెషిన్ రీడబుల్ ఓటరు జాబితా విడుదల చేయాలని ఈ సందర్భంగా స్టాలిన్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరారు.మరోవైపు, ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కోసం ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయని, స్పష్టమైన ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కర్నాటకలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఓ నియోజక వర్గంలో సర్వే నిర్వహించగా.. దాదాపు లక్ష నకిలీ ఓట్లు తేలిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నిజాన్ని దేశం ముందుంచినా.. ఎన్నికల సంఘం మాత్రం దీనిపై మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
బీజేపీకి పోలింగ్ రిగ్గింగ్ యంత్రంలా ఈసీ
- Advertisement -
- Advertisement -