Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చివరి దశలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు: ఎం. కిషన్ నాయక్ 

చివరి దశలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు: ఎం. కిషన్ నాయక్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని పంచాయితీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం కిషన్ నాయక్ తెలిపారు. నవతెలంగాణ పదో వార్షికోత్సవం జరుపుకోవడం హర్షనీయమని యాజమాన్యానికి, పత్రిక విలేకరులకు, సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 

నియోజకవర్గంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలకు ఎంపికైన వాటిలో మూత్రశాలలు ,మరుగుదొడ్ల, మరమ్మత్తులు, నీరు, విద్యుత్ సౌకర్యాల పునరుద్ధరణ చిన్న చిన్న  మరమ్మత్తులు చివరి దశకు వచ్చినవని తెలిపారు. నియోజకవర్గంలోని 110 మొత్తం పాఠశాలలకు గాను ఐదు కోట్ల, మూడు లక్షల 92 వేల బడ్జెట్ అని ఇందులో డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి 64 పాఠశాలల్లో పనులు పూర్తి అయినట్టు, ఆలూరు మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కు ఒక కోటి 43 లక్షలు మంజూరు అయినట్టు తెలిపారు. వివిధ దశల్లో కొనసాగిన పనులను పరిశీలిస్తూ నాణ్యత పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -