– మండలంలోని ఓ గ్రామ మాజీ సర్పంచ్ అధికార పార్టీ నాయకుడు నిర్వాకం ..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఓ గ్రామానికి చెందిన అధికార పార్టీ కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మండల స్థాయి నాయకుడు హుకుం జారీ చేస్తేనే ప్రభుత్వ కార్యాలయాలలో పనులు జరగాలని పెద్దతనం చెలాయిస్తున్నాడు. ఈ ఉదాంతం జుక్కల్ మండలంలో జరిగింది. ఈ విషయం మండలంలో యూట్యూబ్లో చెక్కర్లు కొడుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగుల్ గావ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భర్త చనిపోతే భర్త పేరు మీద ఉన్న స్థిరాస్తి భూమిని భార్య పేరుపై బదిలాయింపు చేయాలని జుక్కల్ తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఫలానా వ్యక్తి చెప్తే తప్ప పనులు కావని అధికారులు తెలియచేశారని వారు అన్నారు. లేకపోతే ఎమ్మెల్యే లెటర్ తీసుకొని వస్తేనే ఆ పని పూర్తి అవుతుందని కరాఖండిగా చెప్తున్నారని లబ్ధిదారులు ఆవేదనతో మీడియాకు తెలిపారు.
అయితే వాళ్ళ పేర్తు చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. అదేవిధంగా మండలంలో మట్టి తరలించాలన్నా.. సీసీరోడ్డు వేయాలన్నా.. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా.. తన పాత్ర అందులో ప్రముఖంగా ఉంటుందని తెలిపారు. అతనికి తెలియకుండా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని అధికారిక కార్యాలయాలో తన ప్రవృత్తిని నిరంకుషత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మండలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు తమ అనుచరులమని చెప్పుకుంటూ గ్రామాలలో ఇందిరమ్మ పథకంలో గృహాలు నిర్మిస్తున్న వారి వద్ద లబ్ధిదారుల నుంచి వేల రుపాయలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. తాము చెప్తేనే మీకు ఇండ్లు వచ్చాయని, డబ్బులు కూడా మంజూరు అవుతున్నాయని అందిన కాడికి దండుకుంటున్నారు.
మారుమూల ప్రాంతమైన జుక్కల్ గ్రామాలలో అమాయక, నిరక్షరాస్యులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబు అని స్థానిక యువకులు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులకు భరతం పట్టాల్సిన అవసరం ఆసన్నమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయం ప్రస్తుత ఎమ్మెల్యే తెలిసి జరుగుతుందో.? లేదా తెలియడం లేదో .? ప్రజలకు అర్థం కావడం లేదని అంటున్నారు. ఇటువంటి నాయకులు పార్టీలో ఉంటే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం సుస్పష్టంగా కనిపిస్తుందని మండల ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇటువంటి వ్యక్తులపైన సమగ్ర విచారణ జరిపించాలని, వాస్తవాలు అప్పుడే బయటకు వస్తాయి అని, తరువాత కాంగ్రెస్ పార్టీ శాఖపరమైన చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యేకు మండలంలోని పలు గ్రామ ప్రజలు సూచిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చెబితేనే పనిపూర్తి.. లేదంటే అంతే సంగతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES