నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ మండల భారతీయ కిసాన్ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షులు విట్టల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పెద్ద కొడప్ గల్ మండల కేంద్రం లోని రైతు వేదికల్లో నిర్వహించిన రైతుల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని రైతుల సమస్యల పరిష్కారం కై కిసాన్ సంఘం పనిచేస్తుందని తెలిపారు. మండల అధ్యక్షులు గా బస్వారాజ్ దేశయ్, ఉపాధ్యక్షులుగా జైత్రం, గిరాప్ప, కార్యదర్శి బోడి రాజు, సహాయ కార్యదర్శిగా బోడి మల్లికార్జున, రంజిత్, సభ్యులు గా గురుదాస్, గోపాల్ సింగ్, జైపాల్, జక్కుల అంజయ్య, రాజు, హనుమంతరావు పటేల్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షులు విట్టల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్, బాన్స్వాడ డివిజన్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంతరావు, పెద్ద కొడప్ గల్ గ్రామ భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షులు కుమార్ సింగ్, ఉపాధ్యక్షులు అఫోజ్, కార్యదర్శి మహేందర్, రైతులు పాల్గొన్నారు.
భారతీయ కిసాన్ సంఘం మండల కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES