నవతెలంగాణ – ఆలేరు
బీహార్ ఎన్నికల ఓటర్ లిస్ట్ జాబితాలో లో మొట్టమొదటిసారిగా నమోదైన మింటా దేవి అనే మహిళ 124 సంవత్సరాల వయసు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టులో ఉండడం తో ఆమె ఫోటోతో కూడిన టీ షర్ట్ లను ధరించి బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీలు ప్రియాంక గాంధీ మల్లు రవి కాంగ్రెస్ ఎంపీల బృందం ఢిల్లీ పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. మంగళవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నవ తెలంగాణతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ బిజెపి జేబు సంస్థగా మారిందని బిఆర్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించేందుకు 60 లక్షల ఓట్లకు పైగా ఓటర్ జాబితా నుండి తొలగించారని ఆరోపించారు.ప్రధాని మోడీ మూడోసారి ఓట్ల చోరీ ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై గెలిచి గద్దనెక్కాడని విమర్శించారు.మింటా దేవి మధ్య వయసు మహిళ 124 సంవత్సరాలు ఇండియాలో ఏ ఒక్కరు ఇప్పటివరకు బతికింది లేరన్నారు.
బీహార్ రాష్ట్రం నుండి అనేకమంది తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్రలకు ప్రజలు వలస వెళ్లారు.మోడీ విధానాల వల్ల వలస వెళ్లిన ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా ఓటేస్తారని భయంతోనే వారందరినీ తొలగించే ప్రయత్నం చేస్తున్నారని గత మూడు ఎన్నికల్లో ఓటేసిన వారిని సైతం మళ్లీ తిరిగి ఇప్పుడు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కోరడం పట్ల అభ్యంతరం చెప్పారు. గతంలో ఇచ్చిన ఓటర్ గుర్తింపు ఆధార్ కార్డు చెల్లవనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆధార్ కార్డు ఆధారంగానే ఇచ్చే పాస్పోర్ట్ మాత్రం చెల్లుతుందట ఎలక్షన్ కమిషన్ ఇంత తెలివి తక్కువగా పెడుతున్న నిబంధనలు. చూస్తే ఆశ్చర్యమేస్తుందన్నారు. ఇండియా డిజిటల్ అయిందని ప్రధాని మోడీ గొప్పగా చెబుతున్నారు సిసి పుట్టేజులు ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్ట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవ్వడానికి భయం ఎందుకు అంటూ ప్రశ్నించారు.
ఓట్ల చోరీ జరుగుతుంది. దేశవ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని బిజెపి ఎన్నికల కమిషన్ ప్రతిపక్షాలు గెలవకుండా ఓట్లను తారుమారు చేసి మోడీని మూడోసారి గద్దెనెక్కించారని ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి మీద ప్రజల్లో సందేహం మొదలైంది అన్నారు. సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీ లాగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆఫడేబిట్ ఇవ్వాలని ఇవ్వాలని కోరడం రాజ్యాంగం ప్రజాస్వామ్యం విలువలను కాల రాయడం అన్నారు. ఓట్ల చోరీ బంద్ కరో అంటూఇండియా కూటమి దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు ప్రజాస్వామ్యo పరిరక్షణ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.
మింటా దేవి ఫోటో టీ షర్ట్స్ తో వినూత్న నిరసన: ఎంపీ చామల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES