నవతెలంగాణ – కంఠేశ్వర్
సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. సీపీఐ(ఎం) భారత ప్రధాన మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సితా రామ్ ఏచూరి డెభ్బై మూడవ జన్మదిన సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. దేశంలో కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుల్లో ఒకరైన సీతారాం ఏచూరి అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పార్టీ విధానాలను ప్రచారం చేయటంలో, దేశంలో మత విద్వేషాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలను మతతత్వ బిజెపిని వ్యతిరేకించటంలో ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి ఐక్యపరచటంలో సీతారామయ్య కృషి అనిర్వచనీయమని అన్నారు.
ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ కష్టజీవుల పక్షాన కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం తన వర్గ దృక్పథాన్ని వీడనాడి పేదల కోసం పోరాటాలు నిర్వహించారని అన్నారు. ప్రజా సమస్యలను భారత పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా ఎలుగెత్తి చాటటంతో పాటు వాటి పరిష్కారానికి మార్గాలను చూపారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని లౌకిక భావాలను కాపాడటం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. నేటి భారత నేటి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతున్న సందర్భంలో వాటికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ఆయన కృషి ఎనలేనిదని, భారతదేశంలో కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తన జీవితాంతం కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయం మేరకు దేశంలో సీపీఐ(ఎం) కష్టజీవుల సమస్యలపై పోరాడుతుందని, మత విద్వేషాలను వ్యతిరేకిస్తూ ఇస్తూ భారత ప్రజలను ఐక్యం చేసి లౌకిక వాద రాజ్యం ఏర్పాటుకు కృషి చేయటమే సీపీఐ(ఎం) లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, నగర నాయకులు నరసయ్య, దీపిక, ఈవీఎల్ నారాయణ, ఉద్ధవ్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.
సీతా రామ్ ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES