Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అక్రమ మట్టి ఇసుక తవ్వకాలపై నియంత్రణ చర్యలు తీసుకోవాలి

అక్రమ మట్టి ఇసుక తవ్వకాలపై నియంత్రణ చర్యలు తీసుకోవాలి

- Advertisement -

మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు అత్కూరి శ్రీకాంత్ సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వినతి
నవతెలంగాణ – కాటారం

కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో సహజ వరులు అయినటువంటి మట్టి, ఇసుక  అక్రమంగా దోపిడి చేసి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ప్రజల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అత్కూరి శ్రీకాంత్ అన్నారు. మంగళవారం మంత్రి శ్రీధర్ బాబుకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు కిందిస్థాయి నుంచి హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు వినతులు అందజేసిన ఫలితం లేకపోయిందని, ఇప్పటికైనా మంత్రిగారు స్పందించి అధికారులతో కుమ్మక్కై అక్రమంగా దోపిడి గురవుతున్న మట్టి, ఇసుక  తవ్వకాలకు పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా స్పందించని అధికారులపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపి, తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. కాటారం సబ్ డివిజన్ అభివృద్ధికై యువత, వ్యవసాయ కూలీలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. దానికోసం ఆర్థికంగా కాటారన్ని అభివృద్ధి చేసి, కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా వంద పడకల ఆస్పత్రి, డిజిటల్ లైబ్రరీ, మినీ స్టేడియం సకల సౌకర్యాలు ఉండే విధంగా స్కిల్ కోచింగ్ సెంటర్లతోపాటు విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు చేసి కాటారం సబ్ డివిజన్ ని అభివృద్ధి చేసే విధంగా మంత్రి చొరవ తీసుకోవాలని వినతిపత్రంలో కోరినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad