– రోడ్డు ప్రమాదాల కట్టడానికి తీసుకోవలసిన చర్యలపై సూచనలు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రం పరిధిలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై గత మూడు సంవత్సరాలలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు (బ్లాక్ స్పాట్స్ ) జరిగిన సంఘటన స్థలాలను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పరిశీలించారు. మంగళవారం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, సిఐ భీంగల్ సత్యనారాయణ గౌడ్, రోడ్లు భవనాలు, నేషనల్ హైవే, ఆర్టీఏ, పంచాయితీ అధికారులతో కలిసి మండల కేంద్రం ప్రారంభం నుంచి ముగింపులో ఉన్న జిల్లా సరిహద్దు గండి హనుమాన్ వరకు గత మూడు సంవత్సరాలలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు (బ్లాక్ స్పాట్స్ ) జరిగిన సంఘటన స్థలాలను ఆయన పరిశీలించారు.ఈ మూడు సంవత్సరాలలో ఇప్పటివరకు ప్రమాదాలు జరిగిన వివరాలను కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మళ్ళీ రోడ్డు ప్రమాదాలు పునరావృతo కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తూ సిబ్బందికి, ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
బ్లాక్ స్పాట్స్ స్థలాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES