- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
వానాకాలం సీజన్‌లో ఉప్పునుంతల మండల రైతులకు యూరియా, డి.ఏ.పి., పురుగుమందులు, కాంప్లెక్స్ ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కేసు మల్ల సైదులు మంగళవారం డిమాండ్ చేశారు. రైతులు నారుమళ్లు వేసి నాట్లకు సిద్ధమవుతున్న ఈ సమయంలో దొడ్డు రకం యూరియా కూడా లభ్యమయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఎంఆర్పీ ధరలకు మాత్రమే అమ్మకాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులపై సబ్సిడీలు తగ్గించే యత్నాలను కేంద్రం విరమించుకొని, పంచాలని ఆయన స్పష్టం చేశారు.
- Advertisement -