Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
వాతావరణం శాఖ హెచ్చరిక మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా లో రాబోయే మూడు రోజు (72) గంటలు భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతాయని జిల్లా అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు  సంబంధిత అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రానున్న మూడు రోజులు అతి నుండి భారీ వర్షాలు కురిసే  నేపథ్యంలో లో  అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరు అప్రమత్తం గా ఉండాలన్నారు. జిల్లా లో ఎలాంటి ప్రాణ, ఆస్తి, పశువులు నష్టాలు జరగకుండా చూడాలన్నారు. జిల్లా అధికారులందరు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో  కంట్రోల్ రూమ్  నెంబర్ 08685293312 సంప్రదించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -