నవతెలంగాణ – అశ్వారావుపేట
హత్య కేసులో నేరం ఋజువు కావడంతో ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు వెల్లడించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధి తిరుమలకుంట నివాసి లింగాల జయలక్ష్మి తన ఫిర్యాదులో తన భర్త లింగాల చక్రధర్ రావు ఆర్.ఎం.పీ. డాక్టర్ గా పని చేస్తున్నాడని, 2022 డిసెంబర్ 08న దురదపాడు నుండి ఫోన్ రావడంతో పేషెంట్ కు వైద్యం చేయడానికి వెళుతున్నానని తనకు వరుసకు కోడలు అయిన దాసరి రమణకు చెప్పి బయటకు వెళ్లాడని, తాను సాయంత్రం ఇంటికి రాగా చెప్పినది. ఆ రాత్రి కి నేను ఫోన్ చేయగా నేను వచ్చేసరికి రాత్రి అవుతుంది మీరు తిని పడుకోండి అని చెప్పారని, ఆ తర్వాత కూడా రెండుసార్లు ఫోన్ చేస్తే తను ఎత్త లేదని, ఇంటికి కూడా రాలేదని, 2022 డిసెంబర్ 9 న రెండు సార్లు కాల్ చేశాను అయినా లిఫ్ట్ చేయలేదు. పక్కింటి పరికల చేను రాము నా భర్తకు కాల్ చేయగా ఎవరో లిఫ్ట్ చేసి, మందులు కొనడానికి భద్రాచలం వెళ్ళాడని చెప్పారు.
నేను భయం వేసి నా కూతురు బండి ప్రభావతి కి ఫోన్ చేయగా నా వద్దకు వచ్చినది.వినాయకపురం లోని గుగ్లోత్ వెంకటేశ్వరరావు గారి జీడి మామిడి తోట ముందున్న పొలానికి వెళ్ళే దారిలో మృతదేహం ఉందని వార్త వాట్సాప్ గ్రూప్ లో రావడంతో నా కుమారుడు విజయ బాలు హైదరాబాద్ నుండి వాట్సాప్ ద్వారా నా కూతురికి చెప్పారు. నా కూతురు నాకు చెప్పకుండా ఆటోలో 11 గంటలకు మృతదేహం వద్దకు తీసుకెళ్లగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కుడి భుజం నుండి పదునైన ఆయుధంతో నరికి చంపిన గుర్తులు ఉన్నాయని తెలిపారు. వారి పై తగిన చర్య తీసుకొమ్మని అప్పటి అశ్వారావుపేట ఎస్ఐ బి.రాజేష్ కుమార్ కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి సీఐ లు నాగరాజు బి. బాలకృష్ణ ల దర్యాప్తు అనంతరం కోర్టులో అశ్వారావుపేట మండలం తిరుములకుంట నివాసి షేక్ నసీర్ అలియాస్ నజీర్ అలియాస్ థంగ్లి అట్టి హత్య చేశాడని,అప్పటి ఇన్స్పెక్టర్ బి. బాలకృష్ణ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కోర్టులో 22 మంది సాక్షుల విచారణ అనంతరం ఇరు పక్షాల వాద, ప్రతి వాదనలు విన్న తదుపరి షేక్ నజీర్ పై హత్యా నేరము రుజువు కాగా జీవిత ఖైదు, రూ.1000 లు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి నిర్వహించారు. అశ్వారావుపేట ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు, కోర్టు నోడల్ ఆఫీసర్ డి.రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు, (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పిసి బి. నాగేశ్వరరావు లు సహకరించారు. కేసులో శిక్ష పడడానికి కృషి చేసిన అశ్వారావుపేట పోలీసులను కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.
హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES