- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన లింగాల బాలకృష్ణ గౌడ్ (36) మధ్యాహ్నం గ్రామ శివారులోని పటేల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుకున్నట్లు పి ఎస్ ఐ నవీన్ చంద్ర తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -