జుట్టు సంరక్షణలో ఉల్లిరసం కీలక భూమిక పోషిస్తుంది. ఉల్లి రసాన్ని జుట్టుపై మర్దనా చేయడం వల్ల జుట్టు పెరగడంతో పాటు చుండ్రు తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. అయితే, సరైన పద్ధతిలో మర్దనా చేస్తేనే ఫలితం ఉంటుంది.
ముందుగా ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని బ్లెండర్‌లో వేసి పేస్ట్‌లా చేయాలి. ఈ ముద్దను ఒక గుడ్డలో వేసి రసాన్ని తీయాలి. ఆ ఉల్లి సాన్ని తలకు, జుట్టు మూలాలకు రాయాలి. కొన్ని నిమిషాల పాటు చేతులతో తలకు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలను డుక్కోవాలి.
ప్రయోజనాలు..
జుట్టును బలంగా మారుస్తుంది
ఉల్లిరసంలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ ఉత్తేజితమవుతాయి. ఇవి జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడతాయి.
చుండ్రుని తగ్గిస్తుంది
ఉల్లి రసంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
ఈ రసంలో రక్త ప్రసరణనకు సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ సులభమై జుట్టు పెరుగుదల మెరుగవుతుంది.
ఉల్లి రసంతో…
- Advertisement -
- Advertisement -