నవతెలంగాణ – ధర్మసాగర్ : శనివారం మండల కేంద్రంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లై కమిషనర్ యోహాను సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాల కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందికరంగా ఉండకుండా అన్ని చర్యలను చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా అకాల వర్షంలో ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని అన్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా ధాన్యం తడవకుండా తాడ్పత్రిలను ఎప్పటికప్పుడు అందించే విధంగా నిర్వాహకులు చూసుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు. రైతులు అందించిన ధాన్యానికి రెండు రోజుల్లో వారి కి డబ్బులు అందించే విధంగా ప్రభుత్వం చేపడుతుందని ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీ యం మహేందర్, డీ సి ఎస్ ఓ కొమురయ్య, డీ సీ ఓ సంజీవ్, డీ పీ యం జన్ను ప్రకాష్,ఎంపీడీవో అనిల్ కుమార్, ఎపీఎం అనిత, సీసీలు సముద్రాల కవిత, కుడికాల రమ, దానయ్య,సెంటర్ ఇంచార్జీ రాధిక,కమిటీ సభ్యులు ప్రసన్న, శిరీష, కల్పన,లక్ష్మి,వివో ఏలు, మహిళా సంఘాల నాయకులు, రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సివిల్ సప్లై కమిషనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES