నవతెలంగాణ – మల్హర్ రావు: దేవుడిపై భక్తి కోసం ప్రభుత్వ బడి తాళం పగలగొట్టిన వినూత్నమైన సంఘటన మండలంలోని ఇప్పపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పాఠశాల ప్రదానోపాధ్యాయుడు శ్రీనివాస్ పూర్తి కథనం ప్రకారం .. ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో గ్రామంలో కొందరు మాలధారణ వేసిన స్వాములు బడి తాళం ఇవ్వాలని కోరారు. తాము బడిలో కొన్ని రోజులు ఉంటూ స్నానాలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకుంటామని అడిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల తాళం ఇవ్వడం కుదరదని అన్నాడు. పాఠశాల ఆపీస్ కార్యాలయంలో విద్యార్థులకు సంబంధించిన బియ్యం, నూనెలు తదితర సరుకులు విలువైన పత్రాలు ఉన్నాయని తెలిపాడు. దీంతో ఆగ్రహించిన వారు దౌర్జన్యంగా తాళం పగలగొట్టారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పగలగొట్టిన వారు వీడియో తీస్తూ పాఠశాల గదిలో ఉన్న వస్తువులు, సామగ్రి చూపుతూ తీయడం విశేషం.
భక్తి కోసం బడితాళం పగలగొట్టారు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES