జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
నవతెలంగాణ-అంబర్‌పేట
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎల్.శ్రావణి, తంగెళ్లమూడి నందగోపాల్‌తో కలిసి బీసీల యుద్ధభేరి పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇస్తామంటే ఒప్పుకునేది లేదని, చట్టపరంగా హక్కుగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఘర్షణ వైఖరి అవలంబించకుండా సాధించే మార్గాలు పరిశీలించాలని సూచించారు. అఖిల పక్ష సమావేశాలు, బీసీ సంఘాల సమావేశాలు, న్యాయ నిపుణులతో, అడ్వకేట్లతో సమావేశాలు జరిపి, సమ ఆలోచనలు చేసి పరిష్కార మార్గాలు సాధించాలని కోరారు. ఇందుకోసం చట్టపరమైన, న్యాయపరమైన మార్గాలు అన్వేషించాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు నీల వెంకటేష్, వేముల రామకష్ణ, శ్రావణి, పి.సుధాకర్, జిల్లా పెల్లి అంజి, చెరుకు మణికంఠ, కరుణ, కవిత, పగిళ్ల సతీష్, హరి తిలక్ సింగ్, శివ, బాలయ్య ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
31న రవీంద్రభారతిలో బీసీల యుద్ధభేరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES