– కామారెడ్డిలో విషాదం
నవతెలంగాణ – కామారెడ్డి
ఈతకు వెళ్లి కవలలు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం తిమ్మప్పపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. సస్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నర్సింలు మంజుల దంపతులకు రాము, లక్ష్మణ్ (13 సంవత్సరాలు) కవలలు సంతానం. అదే గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ స్కూలులో 8వ తరగతి చదువుతున్నారు. స్కూలు అయిపోయాక ఇంటికి వచ్చిన వారు.. ఈత కొట్టేందుకు గ్రామ శివారులోని కుంటకు వెళ్లారు. కుంటలో లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి మృతిచెందారు. కాగా, కవలల తండ్రి నర్సింలు రోజువారీ మేస్త్రీగా పని చేస్తుండగా, మంజుల బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇద్దరు కొడుకులు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈతకు వెళ్లి కవలలు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES