నవతెలంగాణ-హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఓ బేకరిలో కొనుగోలు చేసిన కర్రీపఫ్‌లో చనిపోయిన పాము పిల్ల కనిపించగా కంగుతున్న వినియోగదారు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. సీఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం ఠాణా సమీపంలోని ఓ బేకరిలో.. జౌఖీనగర్‌కు చెందిన శ్రీశైల తన పిల్లల్ని పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చే క్రమంలో మార్గం మధ్యలో ఎగ్‌పఫ్, కర్రీపఫ్ కొనుగోలు చేశారు. ఎగ్‌పఫ్‌ను పిల్లలిద్దరూ బేకరీ వద్దే తినేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత మహిళ కర్రీపఫ్‌ను తినే ప్రయత్నం చేయగా చనిపోయిన పాము పిల్ల కనిపించడంతో కంగుతున్నారు. దీనిపై బాధితురాలు వెంటనే ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీఐ బేకరీని సందర్శించి విచారించారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కు సమాచారం ఇచ్చామని వారి అభిప్రాయం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం చర్చనీయాంశమైంది.
కర్రీపఫ్‌లో చనిపోయిన పాముపిల్ల..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES