- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బుధ, గురువారాల్లో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను బుధ, గురువారాల్లో ఒంటిపూటే నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.
- Advertisement -