Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఆర్జీయుకేటి  చీఫ్ సెక్యూరిటీపై తీవ్ర ఆరోపణలు 

ఆర్జీయుకేటి  చీఫ్ సెక్యూరిటీపై తీవ్ర ఆరోపణలు 

- Advertisement -

– విద్యార్థి సంఘం నాయకులు
నవతెలంగాణ -ముధోల్ : ఆర్జీయుకేటి బాసర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డి. రాజేశ్ పై తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ  సంఘం నాయకులు మంగళవారం తీవ్ర ఆరోపణలు  చేశారు. హైదరాబాద్ లో సిఎం రెవంత్ రెడ్డి ని విధ్యార్థి సంఘం నాయకులు కలిశారు. ఈసందర్భంగా చీప్ సెక్యూరిటీ అధికారి పై పిర్యాదు చేసినట్లు పత్రిక ప్రకటనలో తెలిపారు. చీప్ సెక్యూరిటీ అధికారిఅనుచిత ప్రవర్తన  అధికారం దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమని వారు పేర్కొన్నారు.  విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని శాంతియుత విద్యా వాతావరణాన్ని ధ్వంసం చేస్తూ, విద్యార్థులు విశ్వవిద్యాలయంలో కాకుండా జైలులో ఉన్నట్టుగా అనిపించేలా మారుస్తున్నారని వారు ఆరోపించారు. చట్టవిరుద్ధంగా వ్యక్తిగత వివరాలను సేకరించడం నిజమైన సమ్మతి లేకుండా ఫోన్లను తనిఖీ చేయడం తగదు వారు పేర్కొన్నారు  తన అధికార పరిధి దాటిపోయి విద్యా వ్యవహారాలలో చీప్ సెక్యూరిటీ అధికారి జోక్యంచేసుకుంటున్నారనివారుతెలిపారు.వసతి గృహాలకు ఆహారం తీసుకెళ్లడం వంటి చిన్నవిషయాలకేవిద్యార్థులనుశారీరకంగాఈడ్చడం,మానసికంగావేధించడం.చేస్తున్నారని వారుఆరోపించారు.క్యాంపస్‌లోల్యాప్‌టాప్‌లు,ఫోన్లదొంగతనాలపైపునరావృత ఫిర్యాదులున్నప్పటికీ చర్యలుతీసుకోవటం లేదని వారు పేర్కొన్నారు.ఇలాంటి  చట్టవిరుద్ధ, అనైతిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చీప్ సెక్యూరిటీ అధికారి డి. రాజేశ్ పై స్వతంత్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారుకోరారు.విద్యార్థుల హక్కులను గౌరవిస్తూ, క్యాంపస్ భద్రత చట్టపరమైన  నైతిక పరిమితులలో మాత్రమే పనిచేస్తుందని హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.తక్షణ సరిదిద్దే చర్యలు తీసుకవాలని వారు కోరారు.లేని యేడలవిద్యాప్రాంగణాలు అభ్యాసం కోసం, జైలుకి కాదు అనే  సూత్రాన్ని నిలబెట్టేందుకు టిఎస్ఎ ఎస్ కట్టుబడి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Advertisement
Advertisement
Ad