నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, కంటైనర్ ఢీకొని 11 మంది మృతి చెందారు. దౌసా – మనోహర్‌పూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా రాజస్థాన్‌లోని కథు శ్యామ్ టెంపుల్‌కు వెళ్లి తిరిగి తమ సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.