- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాధాపూర్, దుర్గం చెరువు, రాయదుర్గ్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. కాగా రానున్న మూడు రోజులు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. కాగా అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
- Advertisement -