- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఓ కార్యక్రమంలో బుధవారం మాట్లాడుతూ.. సెమీ కండక్టర్ మిషన్ కోసం తెలంగాణ అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రైమ్ లోకేషన్‌లో 10 ఎకరాల స్థలం కేటాయించామని తెలిపారు. ఏపీ ఒక ఎకరా కూడా కేటాయించకున్నా కేంద్రం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. ఇలాంటి కేంద్ర విధానాలను తెలంగాణ సహించబోదని మండిపడ్డారు.
- Advertisement -