Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ తహసీల్దార్ కార్యాలయంపై అవినీతి మరక

జుక్కల్ తహసీల్దార్ కార్యాలయంపై అవినీతి మరక

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
కామారెడ్డి జిల్లాలోనే అంత్యంత వెనుకబడిన మండలం జుక్కల్ అటువంటి మండలానికి వస్తున్న అధికారులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండల ప్రజల ఆరోపణలు  వస్తున్నాయి. జుక్కల్ గ్రామీణ  ప్రాంతంలో తమ సేవలను అందించి మంచి పనులు చేసి మంచి పేరు, గుర్తింపు పొందాలని అధికారులు మర్చిపోయినారు. రెవెన్యూ అధికారులు తమవంతుగా నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నం చేయడం లేదు. మంచి పనులు చేయడం మానేసి, ప్రజల అవసరాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు అని ఆరోపణలు మండలంలో గుప్పమంటున్నాయి. జుక్కల్ తహసీల్దార్ కార్యాలయానికి తమ అవసరాల నిమిత్తం వ్యవసాయం భూమిని అమ్ముకునేందుకు వచ్చిన వారి నుండి డబ్బులు భారీగా వసూలు చేస్తున్నారు.

గతంలో కూడా ఒక మహిళా తాహశీల్దార్ అవినీతికి పాల్పడి లక్షల రూపాయలు ప్రోగు చేసుకొని జన అగ్రగాహనికి గురై, ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే వరకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వారికి తగిన రీతిలో సమాధానం చెప్పారు. అనంతరం ఆ అధికారిని బదిలీపై వెళ్లిపోయారు. ప్రస్తుతం మండలంలోని భూ యజమానులు భూమిని అమ్మి వేయాలి అంటే మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను బతిమాలాల్సిందే. అధికారుల చేతులు తడాపల్సిందే. జుక్కల్ తహసీల్దార్ పెన్ను కదలాలంటే జుక్కల్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులును ప్రసన్నం చేసుకోవాల్సిందే.

మండల తహసీల్దార్ కార్యాలయ అధికారులా..? లేదా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులా..?  అనే ప్రశ్న ప్రజలలో అనుమానాలకు తావిస్తోంది. అవినీతి అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అయోమయంలో మండల ప్రజలు ఉన్నారు. అవినీతి అధికారుల నాయకుల తీరు మార్చుకోవాలి లేకుంటే జనాగ్రహానికి గురికావాల్సి వస్తుంది అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అవినీతి అధికారులు,  నాయకుల పై చర్య తీసుకుని గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad