నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు, క్యూబా సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాత ఫెడరల్ క్యాస్ట్రో 79వ జయంతి సందర్భంగా బుధవారం సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో అమెరికా తన సామ్రాజ్య వాదాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాలలో పన్నులను పెంచుతూ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు మొదలైంది కాదని, ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కాకుండా అడుగడుగునా పెట్టుబడిదారీ విధానాలను మల్దర్పటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వాటికి వ్యతిరేకంగా ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు ఫెడరల్ క్యాస్ట్రో తన సహచరుడైన చేగువేరా తో కలిసి అనేక దేశాల్లో పర్యటించి కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయటంతో పాటు క్యూబాలో సోస్ట్లిస్ట్ వ్యవస్థను నిర్మించారని తెలిపారు.
తన దేశానికి సమీపంలో ఉన్న క్యూబా లో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణాన్ని తట్టుకోలేని అమెరికా పెట్టుబడుతారు వ్యవస్థ పెట్రోల్ కాస్ట్రోను హతమార్చడానికి అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. అయినా వాటిని తట్టుకొని క్యాస్ట్రో సోస్ట్లిస్ట్ వ్యవస్థను నిలబెట్టి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని వివరించారు. మరణానంతరం కూడా క్యూబా లో సోస్ట్లిస్ట్ వ్యవస్థను కూల్చటానికి అమెరికా తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను విధిస్తూ ఎటువంటి సహకారాన్ని ఇతర దేశాల నుంచి అందకుండా కట్టడి చేస్తున్నారని, దీన్ని ఎదిరించి సోస్ట్లిస్టు అభిమానులు కార్మిక వర్గం క్యూబాను ఆదుకోవటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే సోస్లిస్టు వ్యవస్థ స్ఫూర్తిని కొనసాగించిన వారమవుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, నాయకులు అనిత, రాజు, చక్రి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఫెడరల్ క్యాస్ట్రో 79వ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES