కాస్తూరిబా పాఠశాల తనిఖీ లో వెల్లడి…
ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యేక అధికారి
నవతెలంగాణ – దామరచర్ల
దామరచర్ల మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను మండల ప్రత్యేక అధికారి పత్యా నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనము నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా చికెన్ వండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించి గత వారం నుండి అసంపూర్తిగా నమోదు చేయడం పట్ల అకౌంటెంట్ ను మందలించారు. విధి నిర్వహణలో అజాగ్రత్త పాటిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేసి రిజిస్టర్ లను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అధిక వర్షాల వలన వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు చికిత్స అందించుటకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని డాక్టర్ కు సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్, ఇన్చార్జి ప్రత్యేక అధికారి సైదమ్మ, డాక్టర్ కిరణ్ తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు సరిపడా వండని చికెన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES