- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవయవ దానం దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నగరంలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అనంత్ కులకర్ణి హాజరు విద్యార్థినీ విద్యార్థులకు అవయవ దానం ప్రాముఖ్యతను, దాని ప్రయోజనాలను క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అధ్యక్షులు పాకాల నరసింహారావు, కార్యదర్శి గంజి రమేష్, కళాశాల కరస్పాండెంట్ సూర్యప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -