నివాళి అర్పించిన హరిదా రచయితల సంఘం
నవతెలంగాణ – కంఠేశ్వర్
ధిక్కారాన్ని మమకారాన్ని సమయోచితంగా సంధించి సమాజాన్ని చైతన్య పరిచిన అక్షర క్షిపణి అనిశెట్టి రజిత అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అనిశెట్టి రజిత సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఆచార్య జయశంకర్ సార్ ప్రభావంతో ఉద్యమాల పట్ల ఆసక్తిని పెంచుకొని తెలంగాణ ఉద్యమంలోను, అనేక సామాజిక ఉద్యమాలలో సారధ్య పాత్ర పోషించిన అనిశెట్టి రజితక్క ఉక్కు మహిళ అని ఆయన నివాళి ఘటించారు. “రోజూ రెండు ప్రమాదాలు ఒకటి ఉదయం, రెండు చీకటి” అని ఆమె తన కవిత్వంలో రాసుకున్నారని ప్రతిరోజు అన్ని ప్రమాదాలను దాటు కలిగిన ఆమె ఆగస్టు 11నాటి మృత్యు ప్రమాదాన్ని దాటలేకపోయారని స్త్రీవాద రచయిత్రిగా ఆమె రక్షణ కవచంగా నిలిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
2010లో తెలంగాణ రచయితల వేదిక, హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ ఖిల్లా జైలులో దాశరథి యాదిలో ఒకరోజు అనే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న జ్ఞాపకాలు మరువలేని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చమురు ఆరని దివిటీ లాగ ఆమె పని చేసిందన్నారు. 2023లో తెలంగాణ సారస్వత పరిషత్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాహితి సభలలో “మహిళల సాహిత్యంలో స్త్రీ అస్తిత్వవాదం” అనే అంశంపై చేసిన పత్ర సమర్పణ ఎంతో విలువైందని ఆయన తెలియజేశారు. ఆమె మరణం ప్రజా ఉద్యమాలకు తెలంగాణ సాహిత్యానికి తీరని లోటు అని, విద్యార్థి దశ నుంచి ఆమె పోరాటాలలో పాల్గొన్నారని సీనియర్ జర్నలిస్ట్ జమాల్పూర్ గణేశ్ అన్నారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ రజితక్క కవిత్వం, వ్యక్తిత్వం రెండు ఆదర్శమేనని రెండు కూడా త్యాగంతో ముడిపడి ఉన్నాయని అన్నారు.
కవయిత్రి శారద మాట్లాడుతూ తనలాంటి ఎందరో రచయితలకు రజితక్క ఆదర్శమని, తాను అందించిన ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కువైత్రులు కీలక పత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది ఆశ నారాయణ మాట్లాడుతూ జయశంకర్ సార్ బాటలో నడిచి జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన ప్రజా కవయిత్రి అని నివాళులర్పించారు. తెరసం జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్ప ప్రసాద్ రజిత అక్క కవితా పంక్తులను వినిపించారు. ఆమె కవిత్వం బడుగు వర్గా లకు, బాధిత స్త్రీలకు ఒక ఉత్తేజంగా పనిచేసిందన్నారు. దొడ్డి హనుమాన్లు మాట్లాడుతూ రజతక్క మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటుఅని అన్నారు. ఇందూరు యువత అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ రుద్రమదేవి అంశతో రజితక్క పని చేసిందని, ఉద్యమంకాలంలో తమకు ఎతో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, ఎం ఏ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
అక్షర క్షిపణి అనిశెట్టి రజిత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES