సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కళిందర్ఖాన్..
నవతెలంగాణ – జన్నారం
ఆగస్టు 20 నుంచి 22 వరకు హైదరాబాదులో నిర్వహించే సిపిఐ తెలంగాణ నాల్గవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కళిందర్ ఖాన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో అందుకు సంబంధించిన గోడప్రతులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆగస్టు 20 నుండి 22 వరకు హైదరాబాదులో జరగబోయే తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈ మహాసభలలో రాష్ట్ర ప్రజా సమస్యలపై మరియు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించి పలు తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
అదే రకంగా ఎర్రజెండా పార్టీలు ఎప్పుడైనా ప్రజల పక్షపాతమే గాని ప్రజల యోగక్షేమాల వైపే ఆలోచిస్తాయి కావున మేధావులు కార్మిక కర్షకులు విద్యార్థులు ప్రజలు ఈ మహాసభల విజయవంతంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరుగుతోంది అదే రకంగా కమ్యూనిస్టులకు ఆమోగమైన చరిత్ర ఉందని ఆ చరిత్ర సాక్షిగానే రేపు జరగబోయే మహాసభలు నిలువుటద్దమని తెలియజేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వము కేవలము కొంతమంది గుప్త పెట్టుబడిదారులకు దేశ సంపదను దోసి పెడుతుందని ఎద్దేవా చేశారు రేపు జరగబోయే మహాసభలలో కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి దాసరి తిరుపతి జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న చాడ మహేందర్ రెడ్డి మామిడి విజయ్ తదితరులు పాల్గొన్నారు..
భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES