నవతెలంగాణ – కంఠేశ్వర్
క్విట్ కార్పొరేట్ నినాదంతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేయం), వామపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం నిజామాబాద్ లోని ఎన్టీఆర్ చౌరస్తాలో మోడీ – అమిత్ షా దిష్టిబొమ్మల దగ్ధం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవరాం అధ్యక్షత పెద్ది వెంకట్రాములు, పల్లపు వెంకటేష్, వేల్పూర్ భూమయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఏఐటియుసి ఓ మయ్య, టి యు సి ఐ సుధాకర్, ఐఎఫ్టియు మల్లికార్జున్ సాయి రెడ్డి, తోపాటు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబులు,కమలాపురం రాజన్న, సాయ గౌడ్, ఐద్వా అధ్యక్ష – కార్యదర్శులు అనిత – సుజాత, విద్యార్థి సంఘాల నాయకులు విగ్నేష్, రాజు, గణేష్ తదితరులు అధ్యక్షత వహించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ… 1942 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఆనాటి బ్రిటిష్ వలస పాలకులను తరిమికొట్టడం కోసం క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టారు.
ఈరోజు మోడీ ప్రభుత్వం భారతదేశం మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుంది. ఇంకా అప్పగించ చూస్తున్నది. వ్యవసాయ రంగం, కార్మిక రంగాలను నిర్వీర్యం చేస్తున్నాయి. స్వదేశీ వ్యాపారాలు క్షీణించిపోతున్నాయి. ఆనాడు బ్రిటిష్ వాళ్లకు భూస్వామ్య,ధానాడ్య వర్గాలు ఏ విధంగానైతే సపోర్టుగా నిలబడ్డాయో, ఈనాడు బిజెపి మతోన్మాద పాలకులకు కార్పొరేట్ సంస్థలు, బడా పెట్టుబడిదారులు, ధనార్ధేవర్గాలు, భూస్వామ్య వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. వీరి అండదండలు చూసుకుని బిజెపి దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నది. దీన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం), అలాగే వామపక్ష కార్మిక సంఘాలు అన్ని విప్లవ పంథా లోకి వచ్చి క్విట్ కార్పోరేట్ అనే నినాదం తీసుకొని పోరాడుతుంటే.., క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా బ్రిటిష్ పోలీసులు వ్యవహరించని రీతిగా ప్రస్తుతం ఇండియా పోలీసులు దిష్టిబొమ్మను కూడా తగలబెట్టనీయకుండా అడ్డుకొని దిష్టిబొమ్మల కాళ్లు, చేతులు చింపేసి ఆనందించారు. కానీ క్విట్ కార్పొరేట్ ఉద్యమకారులు వెనకడుగు వేయకుండా దిష్టిబొమ్మల మధ్యలో ఉన్న కాగితాలనైనా తీసి తగలబెట్టి మరీ నిరసన వ్యక్తం చేసి జయప్రదం చేశారు.
అని పెద్ది వెంకట్రాములు ప్రస్తుత పోలీసు వ్యవస్థని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని నిర్బంధాలు విధించినా కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు ఈ దేశ శ్రేయస్సు కోసం వెనకడుగు వేయరు అని నొక్కి చెప్పారు. ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం దేశాన్ని కార్పొరేటీకరణ – కాషాయీకరణ చేయకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా ఉంటూ పాలన కొనసాగించాలని.! లేనిచో 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టిన దేశ ప్రజలకు మిమ్మల్ని తరిమికొట్టడం అంత కష్టం కాదు అని హెచ్చరించారు. నాడు బ్రిటిష్ పాలకులకు అండదండగా నిలిచిన ఆర్ఎస్ఎస్, జన సంగ్, సంఘ పరివార్ శక్తులు ఈరోజు నీతి మాటలు పలుకుతున్నారని రమేష్ బాబు, దేవరాం, వెంకటేష్, వేల్పూర్ భూమయ్య, నూర్జహాన్, సుధాకర్ లు అన్నారు. అందుకోసం కార్పొరేట్ వ్యవస్థల నుండి దేశాన్ని కాపాడుకునేంత వరకు మా పోరాటాలు ఆగవని ముక్తకంఠంతో నినాదించారు.
మోడీ, అమిత్ షా ల దిష్టిబొమ్మల దహనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES