గతంలో మరమ్మతులు చేసినా..మళ్లీ పగుళ్లు
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ అవరణంలోని జాతీయ చిహ్నం పగుళ్ల బారిన పడి అందవిహినంగా దర్శనిమిస్తోంది. గతంలో జాతీయ చిహ్నం పగుళ్ల బారిన పడడంతో నవతెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.స్పందించిన ప్రజాప్రతినిధులు మరమ్మతులు చేపట్టారు. మరమ్మతులు చేసినా మళ్లీ పగుళ్ల బారిన పడడం కోసమెరుపు. ప్రజాప్రతినిధుల పదవికాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులతో పాలనను నెట్టుకొస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న అధికారులు జాతీయ చిహ్నం మరమ్మతులపై దృష్టిసారించకపోవడం ఆశ్చర్యం. పగుళ్ల బారిన పడిన జాతీయ చిహ్నంపై నవతెలంగాణ బుధవారం ఎంపీడీఓ ప్రవీన్ దృష్టికి తీసుకువెళ్లగా మరమ్మతులు చేపట్టి స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్దం చేస్తామని తెలిపారు.
పగుళ్ల బారిన జాతీయ చిహ్నం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES