Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవ కేంద్రం ఏర్పాటు

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవ కేంద్రం ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం మద్నూర్ మండల ఎంపీడీఓ  కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన వివిధ శాఖల మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్  మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఎలాంటి విపత్తును అయిన ఎదుర్కోవడానికి సంబంధిత శాఖల అధికారులు సిద్ధం కావాలని అన్నారు. ప్రజలు భారీ వర్షంలో వాగులు దాటడం, విద్యుత్ స్తంభాలను తాకడం, చెట్ల కింద ఉండటం చేయరాదు అన్నారు.

అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు అన్నారు. భారీ వర్షంలో అత్యవసర పరిస్థితినీ ప్రజలు ఎదుర్కొంటే వారి కోసం మండల తహసీల్దార్ కార్యాలయం లో హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ క్రింది ఫోన్ నెంబర్కుసంప్రదించాలని తెలిపారు. హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్:08464 293099.ఈ సమీక్ష సమావేశంలో మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపీడీఓ రాణి, ఏవో రాజు , మండల ఇరిగేషన్, విద్యుత్, మండల ఎస్ హెచ్ ఓ విజయ్ కొండ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img