నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిది ఒక వరం లాంటిదని, కుటుంబానికి ఎంతగానో ఆర్థికంగా తోడ్పడుతుందని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేల రాజు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డం చోటు అన్నారు. మండలంలోని సారంపల్లి, ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షనే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం చేయుంచుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని తెలిపారు. సీఎం సహాయనిధి త్వరగా వచ్చేందుకు కృషిచేసిన కృషి చేసిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అద్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ లకు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుగ్గిళ్ళ రాములు గౌడ్,మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్ , కోల గంగారామ్ ,కునవేని వినోద్ , గుగ్గిళ్ళ అభిషేక్, కొంపెల్లి శ్యామ్, బల్ల లక్ష్మీపతి, సదానందం, జంగంపల్లి భాగ్యలక్ష్మి, శారద పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి.. నిరుపేదలకు వరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES