నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గన్నీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. బుధవారం, యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇల్లును ఆయన గృహప్రవేశం చేశారు. అనంతరం మాధకద్రవ్యాలు, డ్రగ్స్ నిర్ములన పై ప్రతిజ్ఞ చేశారు.
ఆయన మాట్లాడుతూ మాధకద్రవ్యాల వల్ల యువత చెడు దారులు పడుతున్నారని, మాధకద్రవ్యాలను పూర్తిగా నిర్ములించేందకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదకద్రవ్యాలు లేనివిధంగా చేయాలని అన్నారు. మాదకద్రవ్యాలు సేవించిన, సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పెట్టారని అన్నారు. డ్రగ్స్ గంజాయి నిర్మూలన యువతకు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య, మండల పార్టీ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, గుండ్లపల్లి భరత్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బందరపు బిక్షపతి గౌడ్, బూడిద భాస్కర్, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు బూడిద మధు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతా: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES