వాహనదారుల ఇబ్బందులు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మట్టి రోడ్లు, వాగులు ప్రవహించే రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. బొల్లెపల్లి కాల్వకు సంబంధించి నీళ్లు ఎక్కువగా రావడంతో భువనగిరి మండలంలోని రెడ్డి నాయక్ తండ పరిధిలోని మీటింగ్ తండా లో వరద నీటికి రోడ్డు కొట్టుకుపోయింది.
కాగా భువనగిరి మండలంలోని అనాజిపురం నుంచి వెళ్లే జంపల్లి రోడ్డు రెడ్డి నాయక్ తండ (మిటి తండ)వద్ద ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా ద్వాంసం కావడంతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు గతంలో మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడం లేదని సంబంధిత గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు తాత్కాలిక మరమతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా వెంటనే రోడ్డు పనులను చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రోడ్డు పనులను కాంట్రాక్టర్ వెంటనే ప్రారంభించాలి… భూక్య భాస్కర్ నాయక్ ..
అనాజిపురం నుంచి జంపల్లి రోడ్డు పనులను కాంట్రాక్టర్ ప్రారంభించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని కోరారు.
అనాజీపురం టు జంపల్లి రోడ్డు ధ్వంసం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES