జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరే ట్ సమావేశ మందిరం లో నశా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని జిల్లా మహిళ శిశు దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ ను రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి చేయించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి గా ప్రతి ఒక్కరూ అవ్వాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు శక్తివంచన లేకుండా పోరాడాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్,కలెక్టరేట్ సిబ్బంది లు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES