ముఖ్యఅతిథిగా హాజరైన కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆర్థిక సేవల శాఖ మార్గదర్శకాల మేరకు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ పెద్దకొండూర్ గ్రామంల, పోచంపల్లి మండలాస్ ధర్మారెడ్డిపల్లి గ్రామంలో జిల్లా లీడ్ ఆధ్వర్యంలో జననసురక్ష బీమా పథకాల మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కెనరా బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ బి చంద్రశేఖర ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే కాకుండా, ప్రధానమంత్రి జనధన్ యోజన , ఖాతాలను తెరవడం , ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన , ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన , అటల్ పెన్షన్ యోజన లో నమోదు ప్రక్రియలపై దృష్టి సారించారు. ప్రస్తుత ఖాతాల రీ-కేవైసీ ప్రాముఖ్యత, సైబర్ మోసాల నుంచి రక్షణపై అవగాహన కల్పించారు.
బ్యాంకు సిబ్బంది, సి ఎఫ్ ఎల్ సిబ్బంది, సహకారంతో వేర్వేరు కౌంటర్ల ద్వారా బీమా పథకాల నమోదు నిర్వహించబడింది. బ్యాంకు, ఆర్బిఐ అధికారులు శిబిర నిర్వహణను పర్యవేక్షించి, ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, ఆ ప్రాంతంలో బ్యాంకింగ్ సౌకర్యాల లభ్యతపై ఆరా తీశారు.
ఈ కార్యక్రమానికి కెనరా బ్యాంకు,హన్మకొండ రీజినల్ మేనేజర్ శాంతి కుమార్, ఆర్బిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మి శ్రావ్య, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివరామకృష్ణ , ఎస్ ఎస్ టి ఎన్జీవో (సి ఎఫ్ ఎల్ రాష్ట్ర డైరెక్టర్ అశోక్ , అదనపు, చౌటుప్పల్ మండల ఏపీఎం యాదయ్య ,పోచంపల్లి మండల ఏపీఎం తౌర్య , కెనరా బ్యాంకు చౌటుప్పల్,జిబ్బలకపల్లి ,సంగం,పోచంపల్లి బ్రాంచ్ మేనేజర్లు, కేఫ్ల సిబ్బంది,స్వతంత్ర సాహిత్య సంఘాల మహిళలు ,గ్రామస్థులు , లీడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.