నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన మాడుగుల రాజేశ్వరి పీరీట మంజూరైన రూ. 40 వేల సీఎం సహాయనిధి చెక్కును కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ బుధవారం లబ్ధిదారులాలకి అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గ్రామస్తులకు సహకారంగా నిలుస్తున్నానన్నారు. ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న అనారోగ్య బాధితులకు ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయనిధి రూపంలో సహాయం చేయడం జరుగుతుందన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమం లో లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, నెంట శ్రీను, మాడుగుల వెంకటయ్య, ప్రవీణ్ నాయక్, హరిలాల్ నాయక్, తిరుపతి నాయక్, శ్రీను నాయక్, రాములు, కృష్ణయ్య, కొమ్మగోని జంగయ్య, శివ ధనుష్, అజార్,అరుణ్ మదవులు, కిరణ్, మల్లయ్య, ప్రశాంత్ , బండి కృష్ణయ్య, వినోద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES