నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తానని, పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తిచేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని పలు ఆర్వోబీలు, ఇతర రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై జిల్లా కలెక్టర్ తో కలిసి రైల్వే, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, ఇతర శాఖల అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ను కలుస్తానని తెలిపారు. నగర శివారులోని మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లల్లో నిధులు రావాల్సి ఉందన్నారు. ప్రధానంగా మాధవనగర్కు సంబంధించి రూ.3 కోట్లు, రివైజ్డ్ నిధులు రూ.8.5కోట్లు పెండింగ్ ఉన్నాయన్నారు. అర్సపల్లి ల్యాండ్కు సంబంధించి సుమారు రూ.10 కోట్లు హోల్డ్లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తానని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తా: ఎంపీ అరవింద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES