Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్యూనియన్‌ అసెట్‌ నుంచి కొత్త ఫండ్‌

యూనియన్‌ అసెట్‌ నుంచి కొత్త ఫండ్‌

- Advertisement -

హైదరాబాద్‌ : యూనియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త స్కీమ్‌ను ఆవిష్కరించింది. యూనియన్‌ డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఆల్‌ క్యాప్‌ యాక్టివ్‌ ఎఫ్‌ఒఎఫ్‌ను సెప్టెంబర్‌ 1 నుంచి తెరుస్తున్నట్లు వెల్లడించింది. ఇది సెప్టెంబర్‌ 15 వరకు తెరిచి ఉంటుందని తెలిపింది. అలాట్‌మెంట్‌ తర్వాత ఐదు వ్యాపార రోజులలో తిరిగి ఓపెన్‌ అవుతుంది. హైదరాబాద్‌లో యూనియన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సిఇఒ, ఎండి మధు నయ్యర్‌ మాట్లాడుతూ.. ఇందులో కనీస పెట్టుబడి రూ.1000 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ నిధులను లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయనున్నామన్నారు. ”మ్యూచువల్‌ ఫండ్‌ వినియోగం పెరుగుతోంది, కానీ మరింత లోతుగా విస్తరించడానికి సరళమైన, అన్ని రకాల ఈక్విటీ ఉత్పత్తులు అవసరం. ఈ స్కీమ్‌ మార్కెట్‌ టైమింగ్‌, ఆలోకేషన్‌, టాక్స్‌ సమస్యలను సులభతరం చేస్తూ, ఈక్విటీ ఫండ్‌ టాక్స్‌ ప్రయోజనాలను అందిస్తుంది.” అని మధు నయ్యర్‌ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad