నవతెలంగాణ – కంఠేశ్వర్
మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంజనీరింగ్ సెక్షన్ లో గార్డెన్స్ విధులు నిర్వహిస్తున్న విఆర్ఎ లను పారిశుధ్యం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ను వెంటనే రద్దు చేయాలని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ను వెంటనే రద్దు చేసి గత రెండు సంవత్సరాలుగా ఏవిధంగా నైతే కార్పొరేషన్ లో వివిధ సెక్షన్ల లో60 మంది వీఆర్ఏ లు విధులు నిర్వహిస్తున్నారో అదేవిధంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం దండి వెంకట్ మాట్లాడుతూ. 2023లో జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హన్మంతు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేస్తూ ఆర్డర్ ఇవ్వడంతో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వీఆర్ఏ లుగా విధులు నిర్వహించిన మిమ్మల్ని పారిశుధ్యం నిర్వహించాలని చెప్పడం అన్యాయమని అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు కి వినతి పత్రం ఇవ్వడం వల్ల గత మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరందం 60 వీఆర్ఏ లను కార్పొరేషన్ లో వివిధ సెక్షన్ల కేటాయించారు. ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత 14 మహిళలను అందులో వయస్సు, ఆరోగ్యం బాగాలేని వారిని పారిశుధ్యం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డర్ ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, 14 మంది మహిళా విఆర్ఎ లు మంజుల, సుమలతా, పద్మ, నర్సు బాయి తదితరులు పాల్గొన్నారు.
మహిళా వీఆర్ఏలకు ఇచ్చిన ఆర్డర్ ను రద్దు చేయాలి: దండి వెంకట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES