- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు డిగ్రీ చదివేందుకు వీలుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలంగాణ పోలీసుశాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు డీజీపీ జితేందర్, వర్సిటీ ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలు మర్చుకున్నారు. కానిస్టేబుళ్లు, ఏఎస్సైలకు కోర్సు మెటీరియల్, స్టడీ సెంటర్ యాక్సెస్ ఇస్తామని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
- Advertisement -