నవతెలంగాణ -భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో చందుపట్ల సంఘం తరఫున 3-ఏటీఎం లు , రైతు ఉత్పత్తిదారుల కార్యాలయాన్ని చందుపట్ల పిఎసిఎస్ బ్యాంకు చైర్మన్ మందడి లక్ష్మి నరసింహ రెడ్డి ప్రారంభించారు. చందుపట్ల సంఘం పరిధిలోని సంఘ కార్యాలయం ఆవరణ నందు ఎన్సీడీసీ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు అయినా రైతు ఉత్పత్తిదారుల సంస్థ కార్యాలయంను 1) సంఘ కార్యాలయం చందుపట్ల యందు ఏటీఎం మెషిన్, 2) సంఘ పెట్రోల్ బంకు చీమకొండూరు నందు ఏటీఎం మెషిన్ 3) వీరవెల్లి గ్రామ గోదాము నందు ఏటీఎం మిషన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్ లు బల్గూరి మధుసూదన్ రెడ్డి , సుబ్బురు మహేందర్, పల్లెర్ల స్వామి, అంగడి బాలమ్మ, గంధమల్ల వెంకటేశ్వర్లు, తోటకూరి శంకరయ్య, చింతల వెంకట్ రెడ్డి, నల్ల లక్ష్మీ, భుర్గు సౌజన్య , పెద్దింటి మల్లారెడ్డి, భువనగిరి సావిత్రమ్మ సంఘ సిబ్బంది సిఈఓ నల్లమాస రాములు, మందడి నిర్మల, కొండోజు ఉషా రాణి, గుర్రం నాగరాజు, గుర్రం నరసింహులు, బోడ సంజీవ, ముసుకు నవీన్ కుమార్ రెడ్డి , గజరాజు సత్తయ్య, సయ్యద్ హనిఫ్, ములుగు నరసింహ, గాదం నాగార్జున, జమున నవీన్, సంఘ రైతు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
ఏటీఎం, రైతు ఉత్పత్తిదారుల కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES