నవతెలంగాణ – జన్నారం
కవ్వాలలోని రాముల చెరువు లోకి వర్షం ద్వారా వచ్చే ముత్తడి వాగు మరమ్మత్తులు చేయించాలని కోరుతూ మండలంలోని కవ్వాల గ్రామానికి చెందిన రైతులు ఇరిగేషన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ డిఇ వెంకటేశ్వర్లు వినతిపత్రం ఇచ్చారు. వర్షం కొడతనే మత్తడి చెరువు ద్వారా మీరు రామలచెరువుకు చేరి పంటలు పండుతాయి అని మత్తడి భాగం నుంచి రాముల చెరువుకు నీరు వచ్చే కాలువ తగ్గిపోవడంతో నిరంత వృధా పోతుందని తక్షణమే మరమ్మత్తులు చేపించాలని రైతులు కోరారు. మరమ్మత్తులు చేయించకుంటే గ్రామంలోని రైతులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సక్రు నాయక్, శ్రీనివాస్ నాయక్, పోచ గౌడ్ వెంకటేష్ గౌడ్ , మహమూద్ , రాజన్న, దుబ్బయ్య , గంగన్న, తదితరులున్నారు.
రాముని చెరువు మత్తటి వాగు మరమ్మత్తులను చేయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES