నాణ్యత ప్రమాణాలు లేని రోడ్లు వేసి ప్రజాధనం దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్
పర్యవేక్షణ చేయని సంబంధిత అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ నుంచి వయా గోపాల్పూర్ వైపు వేసిన రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అత్కూరి శ్రీకాంత్ అన్నారు. కాంట్రాక్టర్ల లాభాల కోసమే నిర్మించినట్లుగా స్పష్టంగా కనబడుతున్నదని లక్షలు వెచ్చించి నాణ్యత ప్రమాణాలు పాటించని రోడ్డు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వలన అటుగా వెళుతున్న ట్రాక్టర్ వీల్స్, ఇసుక ట్రాక్టర్ల తాకిడికి రోడ్లు నాశనం అవుతున్నాయని అన్నారు.
నాసిరకంగా వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు మాత్రం పర్యవేక్షణ చేయకుండా, కాంట్రాక్టర్లకు లాభం చేకూరే విధంగా వాళ్లతో కుమ్మక్కయ్యారా అన్న చందంగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో ఏం జరుగుతుందో ప్రజల అన్న, ప్రజా ధనం అన్న, ప్రభుత్వ ఆస్తులు అన్న, అధికారులకు లెక్క లేకుండా పోతుందని అన్నారు. తక్షణమే సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ గారు పర్యవేక్షణ చేసి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా నాసిరకం రోడ్డు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు గాను తక్షణమే కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని పూర్తి బాధ్యత అధికారులు వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆయనతో మండల కమిటీ సభ్యుడు గుమ్మడి తిరుపతితో పాటు తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES