నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని కేరళ హై స్కూల్ పాఠశాలలో గురువారం ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని ,విద్యార్థులు గోపికలు , శ్రీకృష్ణుడు వేషధారణ వేసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ , ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ మాట్లాడుతూ.. కృష్ణాష్టమి అనేది విష్ణు యొక్క ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు పుట్టిన రోజున పాఠశాలలో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. ఎంతోమంది భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. కృష్ణుడు జీవితం ,బోధనలు మరియు ఆయన చేసిన పనులు విద్యార్థులకు తెలియ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థిని ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ , కారెస్పాండెంట్ అల్లే శైలేంద్ర , తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
కేరళ హైస్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES