ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల కన్న కూతురిపై తండ్రి గత కొన్ని రోజులుగా లైంగిక దాడి చేస్తున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల వయసు గల తన కూతురిపై కన్న తండ్రి గత కొంతకాలంగా అసభ్యకర వీడియోలు చూయిస్తూ శృంగారంపై ఉత్తేజం కలిగే విధంగా ప్రయత్నించే వాడని తెలిపారు. గత వారం రోజుల క్రితం లైంగికదాడి చేసేందుకు ఒత్తిడి చేశాడని అన్నారు. తన తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో తనను వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని, తండ్రిని చూస్తే భయమేస్తుందని ఏడుస్తూ బతిమిలాడింది. దీంతో చలించిన తల్లి ఏమైందని తల్లి.. అరి ఆరా తీసింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపింది. వారు సముదాయించి వెళ్లిపోయారని బాధితురాలి తల్లి తెలిపింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియగా.. గ్రామపంచాయతీ వద్ద గుమిగుడి చర్చించడంతో విషయం బయటపడింది. ఇది గమనించిన బాలిక తండ్రి .. పరారీలో ఉన్నాడు. బాధితురాలి తల్లి తన బంధువులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు.
కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES