- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని చినూర్ గ్రామానికి చెందిన సంజీవులు (47) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చినుర్ గ్రామానికి చెందిన సంజీవులు తన భార్య సావిత్రితో గొడవపడి సోమవారం రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మెదక్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజుల నుండి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై భార్గవ్ తెలిపారు. భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Advertisement -