- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన సంగెం రాజమల్లు ఇటీవల అనారోగ్యంతో ప్రయివేటు ఆసుపత్రిలో చేరి ఖర్చులపాలైయ్యాడు. ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో రూ.32,500 మంజూరైయ్యాయి.ఈ చెక్కును రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అందజేశారు. చెక్కును మంజూరు చేసిన మంత్రి శ్రీదర్ బాబుకు బాధిత కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ సంగెం రమేష్, సంగెం సత్య నారాయణ పాల్గొన్నారు.
- Advertisement -