నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా బి.ఆర్.ఎస్ కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రం నుండి మాజీ ఎంపీపీ భర్త నీళ్లు పటేల్ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి జుక్కల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జుక్కల చౌరస్తా వద్ద కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా అంజనాద్రి వరకు కారు మరియు బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ ఊరేగింపుగా వెళ్లడం జరిగింది. అనంతరం మాసంపల్లి వద్ద గల హనుమాన్ మందిర ఆలయంలో కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జుక్కల్ మండల నాయకులు నిలుపటిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్ఞాపికను అందించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎంపీపీ భర్త నీళ్లు పటేల్, లాడేగావ్ మాజీ సర్పంచ్ భర్త రాజశేఖర్ పటేల్ , యువ నాయకుడు వాస్రే రమేష్ , మంత్రి సాయిలు, నాయకుడు తాటి భూమయ్య , పడంపల్లి టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పాడ బస్వంత్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మాజీ ఎమ్మేల్యే షిండే జన్మదిన వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES